కృష్ణా: మచిలీపట్నం 21వ డివిజన్ బందరుకోటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ లలితా అమ్మ వారికి జరిగే నవ చండి హోమం జరిగింది. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా విచ్చేసి హోమంలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు.