MDCL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS పార్టీ విజయం సాధిస్తుందని ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జోస్యం చెప్పారు. కాప్రా డివిజన్ BRS పార్టీ సీనియర్ నాయకులు గోగికార్ శివకుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై సైతం BRS ఫోకస్ పెట్టిందన్నారు.