VZM: నేటి తరానికి స్పూర్తి ప్రదాతలు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిలని కలక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. ఇవాళ కలక్టరేట్ ఆడిటోరియంలో జాతి పిత మహత్మ గాంధీ జయంతి, మాజి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు సందర్భంగా చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానీయుల ఆశయాల సాదనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.