BDK: మహాత్మా గాంధీ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో మనమందరం నడవాలని కలెక్టర్ సూచించారు.