SDPT: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, బాలు యాదవ్, వంశీ చందర్ రెడ్డి, నరసింహారెడ్డి, చంద్రశేఖర్, సుమలత పాల్గొన్నారు.