MDK: దసరా పండుగ సందర్భంగా చెడుపై మంచి విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ ఉత్సవం ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ దీవెనలతో జిల్లా ప్రజలంతా సిరిసంపదలతో తులతూగాలని ఆమె మనస్ఫూర్తిగా కోరారు.