RR: నవరాత్రి ఉత్సవాలకు షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ శివాజీ సభ్యులకు చేయూతనందించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రూ.90,000 ఆర్థిక సహాయంగా అందజేశారు. శివాజీ సభ్యులు మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా తన వంతు ఆర్థిక సహాయం అందించిన వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.