NRML: దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శ మూర్తి అని ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.