MBNR: నవాబ్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గురువారం ఎస్సై విక్రమ్ తెలిపారు. అధిక సౌండ్‌తో డీజేలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ఆయన సూచించారు. నిమజ్జన ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.