SKLM: మండల కేంద్రం సారవకోట గ్రామ పొలిమేరలో ఉన్న ఉజ్జిడమ్మ అమ్మవారిని గ్రామానికి చెందిన పలువు చిన్నారులు దసరా పర్వదిన సందర్భంగా గురువారం దర్శించారు. ఆలయ అర్చకులు జోష్యుల శ్రీనివాసరావు వారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల్లో దైవభక్తి ఏర్పడినందున భావితరాలకు హిందూ సాంప్రదాయాన్ని మరింత పటిష్టమవుతుందని పలువురన్నారు.