SKLM: రాష్ట్రంలో యూరియా కొరత సమస్య లేదని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గతేడాది కంటే ఈసారి లక్ష మెట్రిక్ టన్నులు అదనంగా సరఫరా చేశామని తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. యూరియా అధికంగా వాడితే భూమి నాణ్యత దెబ్బతింటుందని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులందరూ తమ పంటలను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు.