GNTR: గుంటూరు బీఆర్ స్టేడియం సమీపంలో ఉన్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి అవమానం జరిగింది. బుధవారం విగ్రహం మెడ, కాళ్లకు బైండింగ్ వైర్ కట్టి, దానిపై ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ చర్యను చూసిన స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వెంటనే బ్యానర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.