కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో కొలువై ఉన్న పల్లాలమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు రాజ రాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు శోభాయ మానంగా దర్శనమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మ వారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.