HYD: నగర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను పోలీసు అధికారులు, స్థానిక కాలనీవాసులు, కమ్యూనిటీలు కలిసి ఏర్పాటు చేశాయి. కానీ, సీసీ టీవీ కెమెరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఏది పనిచేస్తుందో తెలియని పరిస్థితి. ఆధారాల సేకరణలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉప్పల్, తార్నాక, మెట్టుగూడ లాంటి పలు ప్రాంతాల్లో CCTV కెమెరాలు అనేక చోట్ల పని చేయడం లేదని సమాచారం.