JGL: మెట్పల్లి పట్టణంలోని మనోహర్ గార్డెన్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణ వైన్‌షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగలు చొరబడి క్యాష్ కౌంటర్లోని నగదును ఎత్తుకెళ్లారు. గురువారం వేకువజామున అటుగా వెళ్తున్న స్థానికులు తెరిచిఉన్న వైన్ షాపును గమనించి యజమానికి సమాచారం అందించారు. కాగా, దుకాణం షట్టర్ తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.