BDK: ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ కృష్ణయ్య బుధవారం బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 సెప్టెంబర్ నెలలో 43 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు వారు వెల్లడించారు. ఇప్పటివరకు ఏరియాకు కేటాయించిన మొత్తం వార్షిక ఉత్పత్తి లక్ష్యంలో 67 శాతం పూర్తి చేశామని, నెలవారీ 1.88 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామన్నారు.