ప్రకాశం: మార్కాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 49 మందిని పార్టీ నియమించగా, వారిలో జిల్లా నుంచి ముగ్గురికి చోటుదక్కింది. మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి, కనిగిరి నుంచి చింతలచెరువు సత్యనారాయణ రెడ్డి,కమిటీలో స్థానం లభించింది.