KMM: రానున్న ఎన్నికల సందర్భంగా ప్రచారం, పోలింగ్ రికార్డింగ్ విధుల్లో తమకు అవకాశం కల్పించాలని ఫొటో & వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఇల్లంగి పిచ్చయ్య కోరారు. ఎంపీడీవో పీ.శ్రీనివాసరావు, తహశీల్దార్ అనంతుల రమేష్లకు వినతిపత్రం అందజేశారు. ఈ విధుల్లో స్థానిక ఫొటోగ్రాఫర్లను వినియోగించుకోవడం ద్వారా ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.