ELR: ఆంధ్రప్రదేశ్ రీ – సర్వే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈనెల 3న నిడమర్రు మండలంలోని సిద్దాపురం, బైనేపల్లి గ్రామాల్లో 3వ విడత రీ – సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ బొడ్డేపల్లి దుర్గాప్రసాద్ తెలిపారు. అదే రోజు ఉదయం 10 గంటలకు సిద్దాపురంలో, మధ్యాహ్నం 3 గంటలకు బైనేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే గ్రామసభలకు రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు.