ADB: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, అభ్యర్థుల తుదిజాబిత, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్, పోస్టల్ బ్యాలెట్ ఇతర ఎన్నికలకు సంబంధించి సమాచారం కంట్రోల్ రూమ్ టూల్ ఫ్రీ నంబర్ 1800425193 సంప్రదించవచ్చన్నారు.