NLG: కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పదకొండవ రోజు గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో శ్రీ యల్లమ్మ అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. దసరా కావటంతో భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, ఈవో పాల్గొన్నారు.