NRML: స్థానిక ఎన్నికల తనిఖీలలో భాగంగా బుధవారం సాయంత్రం దిలావర్పూర్ ఎస్సై పి.రవీందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేశారు. ఈ క్రమంలో భైన్సాకు వెళ్తున్న ఠాకూర్ తరుణ్ సింగ్ మోటార్ సైకిల్ (TS07 FS 3515) మీద వెళ్తుండగా, స్థానిక టోల్‌ప్లాజా వద్ద ఆపి తనిఖీ చేశారు. కాగా అతని వద్ద ఉన్న సరైన పత్రాలు లేని ₹3.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.