JGL: దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ బీ. సత్యప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిని ఆనందోత్సాహాలతో నింపాలని ఆకాంక్షించారు. గొప్ప సంకల్పంతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో జీవించాలని ఆకాంక్షించారు.