కన్న తండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన UP గోండాలో జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న మన్సూర్ ఖాన్ ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో విసుగు చెందిన కుమారుడు.. గాఢ నిద్రలో ఉన్న తండ్రిని గన్తో కాల్చి హత్య చేశాడు. కేసును తప్పుదారి పట్టించాలని చూసి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ న్యూస్ వైరల్ కాగా మంచి పని చేశాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.