GNTR: మేడికొండూరుకి చెందిన కొరివి రవికిశోర్ రాష్ట్ర వైసీపీ ట్రేడ్ యూనియన్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ నియామకం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జరిగిందని వారు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం మండల నాయకులతో కలిసి ఆయన ధన్యవాదాలు చెప్పారు.