ప్రకాశం: తర్లుపాడు మండలం తాడివారిపల్లి, పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాడివారిపల్లి నుంచి కొత్తూరు, మంగళకుంట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సంవత్సరాలుగా ఈ రహదారి ఇలాగే ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.