VKB: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని 8 మండలాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. దీనిని పరిష్కరిస్తూ, అన్ని మండలాలను ఒకే జిల్లా పరిధిలోకి తీసుకుని డివిజన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.