టాలీవుడ్(Tollywood)లో హీరోయిన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నచ్చిన హీరోయిన్లపై, హీరోలపై ఫ్యాన్స్(Fans) ఎన్నో రకాలుగా తమ అభిమానాన్ని చూపుతుంటారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత(Samantha)కు ఓ వీరాభిమాని ఏకంగా గుడి(Temple)నే కట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన వ్యక్తి సందీప్. హీరోయిన్ సమంత(Heroine samantha) అంటే సందీప్ కు చాలా ఇష్టం. సమంతపై అభిమానంతో తన ఇంట్లోనే సమంతకు గుడిని నిర్మించి అందులో ఆమె విగ్రహం ఏర్పాటు చేశాడు.
సమంత(Samantha) పుట్టినరోజు సందర్భంగా ఎల్లుండి ఆ గుడిని ప్రారంభించనున్నారు. సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకోవడంతో ఇప్పటికే సందీప్ తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాలకు వెళ్లి మొక్కుబడులు కూడా చెల్లించుకున్నాడు. సమంత ఆరోగ్యం(Samantha Health) బాగుపడాలని తాను సర్వమత మొక్కుబడుల యాత్రను నిర్వహిస్తున్నాడు.
దక్షిణాది చిత్ర సీమలో ఇప్పటికే హీరోయిన్లపై వీరాభిమానం చూపే అభిమానులు గుడులను నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో హీరోయిన్ కుష్బూ, నమితకు కూడా ఫ్యాన్స్ గుడి కట్టారు. ఇప్పుడు సమంత(Samantha)కు కూడా గుడిని కట్టడంతో సమంత అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత రీసెంట్గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ప్రస్తుం సమంత హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో ‘ఖుషీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఆ తర్వాత ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ (Webseries)లో కూడా నటిస్తోంది.