MDK: రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026–27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.