E.G: గోదావరి నదిలో మునిగి చనిపోయే ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం సాయంత్రం ఇద్దరు భవానీ భక్తులు గోదావరిలో గల్లంతైన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కలిసి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు.