NDL: పాణ్యం మండలం ఎస్.కొత్తూరులో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రూ.1.11 లక్షల విలువైన బంగారు నాగపడిగె భక్తులు విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో రామకృష్ణ తెలిపారు. కానాలకు సరిత కుటుంబ సభ్యులకు స్వామి వారి ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడి చెల్లించుకునట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మర్యాదలతో స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.