ATP: ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PMDDKY) కింద దేశంలోని 100 ఆశావహ వ్యవసాయ జిల్లాలలో ఆనంతపురం జిల్లా ఎంపికైందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలో PMDDKY అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.