ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయంలో ప్రపంచ రేబిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమంను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర కమిషనర్ వెంకటేశ్వరరావు హాజరై టీకాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పెంపుడు శునకాలకు టీకాలు వేయించాలని సూచించారు.