TG: అచ్చంపేటలో జరిగిన ‘BRS జనగర్జన’ సభలో కేటీఆర్ కృష్ణా జలాల వివాదంపై మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతోందని చెప్పారు. దీనివల్ల కృష్ణాకు రావాల్సిన నీళ్లు ఆగిపోవడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా పనిచేస్తాయని ప్రశ్నించారు. ఈ అంశంపై రాహుల్, రేవంత్ స్పందించడం లేదన్నారు. దొంగలను దొంగల మాదిరిగానే చూస్తారంటూ విమర్శించారు.