HYD: శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదు మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం విచారణ జరపనున్నారు. విచారణలో భాగంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రేపు ఉదయం స్పీకర్ కార్యాలయానికి వెళ్లి తన వివరణ ఇవ్వనున్నారు. పార్టీ మార్పు విషయంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలపై స్పీకర్ వివరణ కోరనున్నారు.