VSP: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ భగత్‌సింగ్ 118వ జయంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సీతమ్మధార జంక్షన్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సమితి సభ్యుడు రావి అశోక్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ ఆశయాలను సాధించేందుకు నేటి యువత నిరుద్యోగ సమస్య వంటి దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన అడుగుజాడల్లో పోరాడాలని పిలుపునిచ్చారు.