NZB :శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకులు అధికంగా తరలి వచ్చారు. దీంతో ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో వీక్షించారు. డ్యామ్ పరిసరాల ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టుకు వచ్చిన సందర్శకులు ఫోటోలు దిగుతూ ఆస్వాదించారు.