GNTR: కొల్లిపర మండలంలోని కృష్ణా నది పరివాహక వరద ముంపు ప్రాంతాలలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పర్యటించారు. బొమ్మువానిపాలెంలో వరద పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని, సాయంత్రానికి 7 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.