మేడ్చల్: మరోసారి రాజీవ్ గృహకల్ప కార్పొరేషన్ హౌసింగ్ బోర్డ్ స్థలాల వేలానికి నోటిఫికేషన్ వచ్చింది. పోచారం, గాజులరామారంలో ఉన్న టవర్ల ద్వారా రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు హౌసింగ్ బోర్డు పరిధిలో గ్రేటర్ HYD చింతల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఐడిపీఎల్, నిజాంపేట ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు ప్లాట్ల వేలం ద్వారా మరో రూ.100 కోట్లు రానుంది.