BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పట్టాలు అందజేశారు. ఆదివారం చండ్రుగొండ మండలం పోకల గూడెం గ్రామపంచాయతీలో 21 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదటి విడతలో 56 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 77 ఏళ్లకు అనుమతి లభించిందని అధికారులు తెలిపారు.