ATP: స్పీకర్ అయ్యన్నపాత్రుడును ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. నార్పల, బుక్కరాయసముద్రం మండల కేంద్రాల్లో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, గండికోట – పుట్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అత్యవసరంగా పూర్తి చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.