E.G: నిడదవోలులో కేవీపీఎస్, జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి పద్మశ్రీ గుర్రం జాషువా 131వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. సామాజిక అసమానతలను తొలగించడం కోసం ఆయన రచనల ద్వారా చేసిన కృషిని వక్తలు కొనియాడారు.