BDK: భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 7 గంటల నుండి గోదావరి నిదానంగా పెరుగుతున్నదని బూర్గంపాడు తహసీల్దార్ ప్రసాద్ ఆదివారం వెల్లడించారు. ప్రస్తుతం ఉదయం 11 గంటలకు 42.50 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం నమోదు అయిందని అన్నారు. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో బతుకమ్మ నిమర్జనం చేసే మహిళలు పిల్లలు ఎవరు వాగులు చెరువుల వద్దకు వెళ్లకూడదని సూచించారు.