KMM: ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క పోరాటంతోనే మధిరలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి మంజూరైందని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ అన్నారు. ప్రతి విషయానికి బీఆర్ఎస్ నాయకులు ఉలిక్కిపడుతున్నారని ఆదివారం మధిరలో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. గత ప్రభుత్వం పూర్తి చేయని ఆసుపత్రిని భట్టినే పూర్తి చేశారన్నారు.