PLD: నాగార్జున సాగర్, మూసి నది నుంచి వరద ఉధృతి పెరగడంతో దాచేపల్లి మండలం రామాపురం మత్స్యకార కాలనీని వరద ముంచెత్తింది. దీంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమై, ముందస్తు చర్యలో భాగంగా అర్ధరాత్రి 36 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం నాటికి కాలనీలోని అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరినట్లు అధికారులు తెలిపారు.