NZB: మంజీరా నది పరివాహక ప్రాంతంలోని హంగర్గ గ్రామ ప్రజలను ఇవాళ తెల్లవారుజాము నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంజీరా నది ఉద్ధృతి, గోదావరి బ్యాక్ వాటర్‌తో గ్రామంలోకి నీరు చేరడంతో MRO విఠల్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రజలను తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. బాధితులను వారి బంధువుల ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.