NRPT: జిల్లా మరికల్లోని పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో, అలుగు నుంచి వచ్చిన వరదనీరు నేరుగా 167వ జాతీయ రహదారిపైకి చేరుతోంది. చెరువు కింద కాలువలు కబ్జాకు గురికావడంతో నీరు మళ్లించడానికి మార్గం లేక రోడ్డుపైకి పెద్దఎత్తున చేరుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.