BPT: సీఎం చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ పబ్లిసిటీ రంగంలో ప్రతిభ కనబరిచినందుకు విజయవాడ తుమ్మల కళాక్షేత్రంలో శనివారం అవార్డును ప్రదానం చేశారు. అనంతపురం కలెక్టర్గా విధులు నిర్వహించిన కాలంలో పర్యాటక అభివృద్ధి ప్రచారంలో విశేష కృషి చేసి గుర్తింపు పొందినట్లు తెలిపారు.