TG: గ్రూప్-2 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈ మేరకు 783 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ పూర్తయినట్లు టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే ఈ పోస్టుల నియామకం కోసం అధికారులు నాలుగు విడతల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. దసరా పండుగలోపే తుది ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.