TPT: ఇవాళ తిరుమలలో గరుడ సేవ నేపథ్యంలో ఇప్పటికే మాడవీధుల్లోని గ్యాలరీలకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారికి TTD నిరంతరం ఆహారాన్ని అందించనుంది. సోమవారం ఉదయం వరకు ఏకంగా 4 లక్షల మందికి పైగా సరిపడా భోజన ఏర్పాట్లు చేస్తుంది. అంతే కాకుండా కొండపై అన్నదాన సత్రాన్ని సైతం 24 గంటలు తెరిచి ఉంచనుంది.